ఖమ్మంలోనూ బీజేపీ ప్రభంజనం కొనసానుంది: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

ABN , First Publish Date - 2021-01-20T18:41:24+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నిక , హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించినట్లుగానే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోను బీజేపీ విజయఢంకా కొనసాగుతుందని ఆ

ఖమ్మంలోనూ బీజేపీ ప్రభంజనం కొనసానుంది: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

వరంగల్ : దుబ్బాక ఉప ఎన్నిక , హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించినట్లుగానే  ఖమ్మం, వరంగల్ మున్సిపల్  కార్పొరేషన్ ఎన్నికలలోను బీజేపీ విజయఢంకా కొనసాగుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరుల  సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ గెలవగానే కేసీఆర్ కుటుంబానికి నిద్రపట్టడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలలో ఓడపోతామనే భయంతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.


కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి  కుంటుపడిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగాయన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పాలనలో వరంగల్ నగరం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 
మోడీ నాయకత్వంలో రోబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం ప్రపంచంలో మన దేశానికి తిరుగులేదన్నారు. బీజేపీతోనే దేశాభివృద్ధి  సాధ్యమన్నారు. యువతకు  ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు.

Updated Date - 2021-01-20T18:41:24+05:30 IST