వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మాదే అధికారం

ABN , First Publish Date - 2021-12-30T05:32:39+05:30 IST

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మాదే అధికారం

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మాదే అధికారం
బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న బీజేపీ నేత బంగారు శ్రుతి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి

శివనగర్‌లో జిల్లా కార్యాలయం ప్రారంభం


ఏకశిలనగర్‌ (వరంగల్‌), డిసెంబరు 29 : వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో అఽధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి అన్నారు. వరంగల్‌ శివనగర్‌ ప్రాంతంలోని చారిత్రక మెట్లబావి సమీపంలో బుధవారం ఆమె బీజేపీ జిల్లా కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం శ్రుతి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సీఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. బీజేపీ ఒత్తిడితోనే ప్రభుత్వం రైతుబంధు నగదు జమ చేసిందన్నారు అనంతరం ఆమె ప్రజాసమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటులో కీలకపాత్ర వహించిన నాయకుడు గంటా రవికుమార్‌ను శ్రుతి, శ్రీధర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధా న కార్యదర్శి ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సా, కార్పొరేటర్‌ అనిల్‌, నగర మాజీ అధ్యక్షుడు చింతాకుల సునీల్‌, నాయకులు కుసుమ సతీష్‌, జలగం రంజిత్‌, బండి సాంబయ్యయాదవ్‌, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, అమరేష్‌, రాంకీ, శ్యామ్‌, విజయ్‌కుమార్‌, సతీష్‌, రఫీ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T05:32:39+05:30 IST