కేసీఆర్ పతనం ప్రారంభమైంది: అరవింద్

ABN , First Publish Date - 2021-11-02T22:54:38+05:30 IST

కేసీఆర్ పతనం, టీఆర్ఎస్ పతనం నేటి నుంచి ప్రారంభమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేటీఆర్ త్వరలో కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవబోతున్నారని...

కేసీఆర్ పతనం ప్రారంభమైంది: అరవింద్

న్యూఢిల్లీ: కేసీఆర్ పతనం, టీఆర్ఎస్ పతనం నేటి నుంచి ప్రారంభమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేటీఆర్ త్వరలో కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో త్వరలో ముసలం పుట్టబోతున్నదన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ గౌరవంగా తప్పుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు ఇక ముందు కేసీఆర్‌తో పనిలేదని ఎద్దేవా చేశారు. 


‘‘కేసీఆర్‌కి సిగ్గుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టే దేశ ప్రధాని, దేశ హోం మంత్రి ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమిలాగా… దళితబంధు పథకాన్ని కూడా కేసీఆర్ చేస్తే ప్రజలు, బీజేపీ పోరాటం చేస్తాం. నాగార్జున సాగర్‌లో అభ్యర్థి ఎంపిక తప్పిదం కాబట్టే అక్కడ ఓడిపోయాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో పనిచేయడం లేదు. కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ఫలితాలు చెంపపెట్టు. రేపటి నుండి దళిత బంధు అమలు చేయాలి.’’ అని అరవింద్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-02T22:54:38+05:30 IST