కేటీఆర్ సవాల్‌కు బీజేపీ ప్రతి సవాల్

ABN , First Publish Date - 2021-02-26T20:54:32+05:30 IST

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ విసిరిన సవాల్‌ను బీజేపీ

కేటీఆర్ సవాల్‌కు బీజేపీ ప్రతి సవాల్

హైదరాబాద్: రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ విసిరిన సవాల్‌ను బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్వీకరించారు. లక్ష ఉద్యోగాల కల్పన అంశంపై కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని బీజేపీ ప్రకటించింది. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని బీజేపీ పేర్కొంది. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి కేటీఆర్‌ రావాలని బీజేపీ సవాల్‌ విసిరింది. ఓయూకి వస్తే లెక్కలు తేలతాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 

 

తమ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో బహిరంగ లేఖను కేటీఆర్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామన్న మాటను నిలబెట్టుకున్నామన్నారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ హయాం కంటే తామే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యోగకల్పన అంశంపై విపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్‌తో రాజకీయం హీటెక్కింది. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడేక్కింది. 

Updated Date - 2021-02-26T20:54:32+05:30 IST