మరో వివాదానికి తెరలేపిన బీజేపీ ఎమ్మెల్యే Raja singh
ABN , First Publish Date - 2021-12-30T19:17:24+05:30 IST
: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదానికి తెరలేపారు. గుంటూరులో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలంటూ బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు.

హైదరాబాద్/అమరావతి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదానికి తెరలేపారు. గుంటూరులో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలంటూ బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఏకంగా... జిన్నా టవర్‌ను కూల్చాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. భారత దేశాన్ని రెండు ముక్కలు చేసిన వ్యక్తి గుర్తులు ఇక్కడ ఎందుకుండాలని ఆయన ప్రశ్నించారు. వెంటనే జిన్నా పేరును తొలగించాలని ఆంధ్రప్రదేశ్ సీఎంను కోరుతున్నానన్నారు. జిన్నా సెంటర్‌కు అబ్దుల్ కలాం సెంటర్‌గా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. లేనిచో బీజేపీ కార్యకర్తలే జిన్నా టవర్‌ను కూల్చుతారని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.