బీజేపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-12-30T05:34:36+05:30 IST

బీజేపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి

బీజేపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
బీజేపీ శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు


మామునూరు, డిసెంబరు 29 : దేశ అభ్యున్నతికి బీజేపీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్‌రావు పిలుపు నిచ్చారు. వరంగల్‌ జిల్లా బొల్లికుంట వాగ్దేవి ఇంజ నీరింగ్‌ కళాశాలలో బీజేపీ కార్యకర్తలకు నిర్వహి స్తున్న మూడురోజుల శిక్షణ శిబిరానికి బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలంగాణ ప్ర భుత్వ పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారానికి బీజేపీ నాయకులు పాటుపడా లని సూచించారు. జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, పార్టీ ఇన్‌చార్జి శ్రీనివాసగౌడ్‌, జిల్లా శిక్షణ శిబిరం ఇన్‌చార్జి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో పలువులు బీజేపీ నేతలు హాజరై పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడారు. అధికార దిశ గా బీజేపీ. విదేశీ నీతి-విజయాలు, ఆత్మనిర్భర్‌ భార త్‌, మన కార్యపద్ధతి-పార్టీ సమరచన, సోషల్‌ మీడి యా, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రఘునందన్‌ రావు కాసేపు విలేకరులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర సం ఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల అశోక్‌రెడ్డి, గంటా రవికుమార్‌, సందీప్‌ మిశ్రా, దాస్యపు మురళీధర్‌, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి జలగం రంజిత్‌, మల్లాడి తిరుపతిరెడ్డి, బండి సాంబయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T05:34:36+05:30 IST