కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటా: ఈటల
ABN , First Publish Date - 2021-12-18T02:47:33+05:30 IST
సీఎం కేసీఆర్ పై బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ వ్యూహాలు తెలిసివాడినని, కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ఈటల అన్నారు. కేసీఆర్ ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రళయం రానుందన్నారు. ఆ ప్రళయాన్ని కేసీఆర్ తట్టుకోలేడన్నారు.