రాముడి కార్యంపై రాజకీయాలొద్దు: బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2021-02-01T19:58:55+05:30 IST

వరంగల్: రాముడి కార్యంపై రాజకీయాలు చేయవద్దని బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, పద్మ పేర్కొన్నారు.

రాముడి కార్యంపై రాజకీయాలొద్దు: బీజేపీ నేతలు

వరంగల్: రాముడి కార్యంపై రాజకీయాలు చేయవద్దని బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, పద్మ పేర్కొన్నారు. హన్మకొండ బీజేపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ... దొంగ పుస్తకాలతో విరాళాలు వసూలు చేశామనడంలో వాస్తవం లేదన్నారు. దొంగ పుస్తకాలతో వసూలు చేశామని దమ్ముంటే నిరూపించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ కార్యాలయంలో లైట్లు ఆపేసి దాడి చేశారని.. టీఆర్ఎస్‌కు పోలీసులు సహకరించారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-01T19:58:55+05:30 IST