టీఆర్‌ఎస్ సర్కార్ కొనసాగడం అరిష్టం: ఈటల
ABN , First Publish Date - 2021-07-08T08:12:29+05:30 IST
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గాడి తప్పిందని, ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల

హుజూరాబాద్, జూలై 7: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గాడి తప్పిందని, ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రెండు నెలలుగా తనపై సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, సీఎం కనుసన్నల్లోనే రోజుకో అబద్ధం పుట్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ వారిని వెళ్లగొట్టి, జీ హుజూర్ అనేవారిని మాత్రమే కేసీఆర్ వెంట ఉంచుకున్నారని ధ్వజమెత్తారు.