జనగామలో టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2021-01-13T16:20:53+05:30 IST

ఛలో జనగామకు బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలొకంది.

జనగామలో టెన్షన్ టెన్షన్

జనగామ:  ఛలో జనగామకు బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలొకంది. నిన్న ప్లెక్సీల తొలగింపు విషయంలో ధర్నా చేస్తున్న బీజేపీ నేతలపై సీఐ మల్లేష్ లాఠీఛార్జ్  చేశారు. ఈ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో సీఐను సస్పెండ్ చేయాలని డెడ్‌లైన్ విధించారు. ఈరోజు ఛలో జనగామకు బీజేపీ పిలుపునిచ్చింది. కాసేపట్లో జనగామకు బండి సంజయ్ రానున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. 

Updated Date - 2021-01-13T16:20:53+05:30 IST