నిరసనల వెల్లువ

ABN , First Publish Date - 2021-02-02T04:04:03+05:30 IST

నిరసనల వెల్లువ

నిరసనల వెల్లువ
పరకాలలో టైర్లుకాల్చి రాస్తారోకో చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

ఎమ్మెల్యే ఇంటిపై దాడికి నిరసనగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

బీజేపీ నాయకుల తీరుపై నేతల మండిపాటు

పరకాల, ఫిబ్రవరి 1: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం పరకాల భగ్గుమంది. టీఆర్‌ఎస్‌ నాయకుల పిలుపు మేరకు వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. బైక్‌ ర్యాలీ నిర్వహిస్తూ బీజేపీ ‘గూండాల్లారా.. ఖబడ్దార్‌.. జై చల్లా’ అంటూ నినాదాలు చేశారు. ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించి టైర్లు తగులబెట్టి మంటలు రేపారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈస్టుజోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి పర్యవేక్షించారు. 

గీసుగొండ: ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా కొనాయిమాకుల వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ధర్మారావు, వరంగల్‌మార్కెట్‌ చైర్మన్‌ చింతం సదానందం, కార్పొరేటర్‌ బాలయ్య, డీసీసీబీ డైరెక్టర్‌ దొంగల రమేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు వీరస్వామి, శ్రీధర్‌, మోహన్‌రెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ రఘు తదితరులు పాల్గొన్నారు. 

శాయంపేట: మండల కేంద్రంలోని మాందారిపేట స్టేజి వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పోతు రమణారెడ్డి తదతరులు పాల్గొన్నారు.

దామెర: బీజేపీ దాడికి నిరసనగా దామెరలో టీఆర్‌ఎస్‌ దామెర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బత్తిని రాజకయాదవ్‌, వేల్పుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రధాన మోదీ, బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చిత్రాలతో కూడిన దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కమలాకర్‌, సంపత్‌, ఎంపీపీ శంకర్‌, జడ్పీటీసీ కల్పన, వైస్‌ ఎంపీపీ జాకీర్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా చైర్మన్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

సంగెం: గవిచర్ల ప్రధాన రోడ్డుపైన గ్రామ మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్‌, సంగెం జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డిల నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఆందోలనలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పి.సారంగపాణి, మండల రైతు బంధు అధ్యక్షుడు నరహరి, మాజీ ఎంపీపీలు డి.మల్లయ్య, వీరాచారి,నగర కార్పొరేటర్‌ పి.స్వర్ణలత తదతరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-02T04:04:03+05:30 IST