ఉద్రిక్తంగా బీజేపీ చలో మెదక్‌

ABN , First Publish Date - 2021-02-26T22:05:55+05:30 IST

బీసీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నిర్వహించిన చలో మెదక్‌ ఉద్రిక్తంగా మారింది.

ఉద్రిక్తంగా బీజేపీ చలో మెదక్‌

 మెదక్‌‌: బీసీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నిర్వహించిన చలో మెదక్‌ ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. పరిస్థతి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ నేతలు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. లక్ష్మణ్‌, రఘునందన్‌రావుల అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. 

Updated Date - 2021-02-26T22:05:55+05:30 IST