వ్యవసాయ వ్యర్థాలతో బయో ఇటుకలు

ABN , First Publish Date - 2021-09-03T08:07:35+05:30 IST

దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ వ్యర్థాల తో బయో ఇటుకలను ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - హైదరాబాద్‌’ (ఐఐటీ-హెచ్‌) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భవన ని ర్మాణంలో..

వ్యవసాయ వ్యర్థాలతో బయో ఇటుకలు

  • అభివృద్ధి చేసిన ఐఐటీ-హెచ్‌ పరిశోధకులు
  • ఒక ఇటుక తయారీ ఖర్చు 3 రూపాయలే


హైదరాబాద్‌, సెప్టెంబరు 2: దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ వ్యర్థాల తో బయో ఇటుకలను ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - హైదరాబాద్‌’ (ఐఐటీ-హెచ్‌) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భవన నిర్మాణంలో ఉపయోగిస్తున్న మట్టి, సిమెంటు ఇటుకలకు..  వ్యవసాయ వ్య ర్థాలతో ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించారు. భవనం పైకప్పు, గోడలకు వీటిని వినియోగించవచ్చని బయో ఇటుకల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఐఐటీ-హెచ్‌ పరిశోధకుడు ప్రియబ్రత రౌత్రాయ్‌ తెలిపారు. మట్టి, సిమెంట్‌ ఇటుకల కంటే ఇవి 8 నుంచి 10 శాతం తక్కువ బరువుతో ఉంటాయని.. ఒక్కో ఇటుక తయారీకి 2 నుంచి 3 రూపాయలే ఖర్చవుతుందని చెప్పారు.


బోల్డ్‌ యూనిక్‌ ఐడియా లీడ్‌ డెవల్‌పమెంట్‌ (బిల్డ్‌) ప్రా జెక్టు కింద అభివృద్ధి చేసిన ఈ బయో ఇటుకలకు రౌత్రాయ్‌ పేటెంట్‌ కూ డా పొందారు. మట్టిని బట్టీలలో కాల్చి ఇటుకలను తయారు చేయడం వల్ల ఏర్పడే వాయుకాలుష్యానికి బయో ఇటుకలతో చెక్‌ పడుతుందని ఈ పరిశోధనకు మార్గనిర్దేశం చేసిన ఐఐటీ-హెచ్‌ డిజైన్‌ విభాగం సారథి ప్రొఫెసర్‌ దీపక్‌ జాన్‌మాథ్యూ పేర్కొన్నారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే బయో ఇటుకలతో నిర్మించే భవనంలో 5 నుంచి 6 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని వివరించారు. కాగా, బయో ఇటుకలతో నిర్మించిన నమూనా భవనాన్ని ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎ్‌స.మూర్తి గురువారం ప్రారంభించారు. 


Updated Date - 2021-09-03T08:07:35+05:30 IST