బైక్‌పై ప్రమాదకర ఫీట్లు చేస్తున్న యువత

ABN , First Publish Date - 2021-02-28T16:25:12+05:30 IST

ఒకవైపు తాగుబోతుల వీరంగంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడంలేదు.

బైక్‌పై ప్రమాదకర ఫీట్లు చేస్తున్న యువత

హైదరాబాద్: ఒకవైపు తాగుబోతుల వీరంగంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడంలేదు. ఈ క్రమంలో వరుస రోడ్డు ప్రమాదాలతో హైదరాబాద్ వాసులు భాయాందోళనకు గురౌతున్నారు. బైక్‌పై ప్రమాదకర ఫీట్స్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే టోలీచౌక్ ప్రధానరహదారిలో ఓ యువకుడు ఈ ఫీట్లు చేస్తూ హల్ చల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను స్థానికలు పోలీసులకు షేర్ చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో ఆ యువకుడు చాలా సార్లు రోడ్లపై ఫీట్లు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేసినట్లు సమాచారం. వీకెండ్ సమయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Updated Date - 2021-02-28T16:25:12+05:30 IST