Bhupalapalli: వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం

ABN , First Publish Date - 2021-12-08T12:41:51+05:30 IST

కాటారం మండలంలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి రోడ్డు దాటుతుండగా పులి అడుగుజాడలను వాహదారుడు తన మొబైల్ ఫోన్‎లో వీడియో తీశాడు

Bhupalapalli: వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం

భూపాలపల్లి:  కాటారం మండలంలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. 10కి పైగా ఆవులు, గేదెలపై దాడి చేసి చంపేసింది. పెద్దపులి రోడ్డు దాటుతుండగా పులి అడుగుజాడలను వాహదారుడు తన మొబైల్ ఫోన్‎లో వీడియో తీశాడు. కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి..ఇప్పుడు వీరాపూర్ అటవీ ప్రాంతంలో తిరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. పులి దృశ్యాలను చూసి గ్రామ ప్రజలు, స్థానికులు హడలిపోతున్నారు. పెద్దపులి సంచారంపై గ్రామ ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు పులి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-12-08T12:41:51+05:30 IST