సదరం సందడి

ABN , First Publish Date - 2021-12-31T20:03:00+05:30 IST

భూపా లపల్లి జిల్లా ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం క్యాంపునకు విశేష స్పందన లభించింది.

సదరం సందడి

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 30: భూపా లపల్లి జిల్లా ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం క్యాంపునకు విశేష స్పందన లభించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న దివ్యాం గులు భారీ సంఖ్యలో హాజర య్యారు.  మీ-సేవా కేంద్రాల్లో మొత్తం 281 మంది రిజిస్టర్‌ చేసుకోగా వీరిలో 251 మంది శిబిరా నికి హాజరయ్యారని అధికారులు తెలిపారు.  మానసిక వికలాంగులు 90 మంది, వినికిడిలోపం ఉన్న వారు 112, కంటి సంబంధిత సమస్యలు ఉన్న 49 మందికి డాక్టర్లు ప్రవీణ్‌కుమార్‌, రాజేంద్రప్రసాద్‌, పట్టాభిరాం పరీక్షలు చేశారు. ఈ క్యాంపును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ భవేష్‌మిశ్రా సందర్శించారు. రిజిస్టర్‌ చేసుకోని వారికి మరో రెండు నెలల్లో సదరం క్యాంపును నిర్వహి ంచను న్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీహెచ్‌వో డాక్టర్‌ తిరుపతి, ఇన్‌చార్జి డీఎం హెచ్‌వో  డాక్టర్‌ శ్రీరామ్‌, డీఆర్డీవో పీడీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T20:03:00+05:30 IST