బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో జగత్ కూడా...!

ABN , First Publish Date - 2021-01-12T23:52:41+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా కుటుంబ సభ్యుల పాత్ర దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల అదుపులో అఖిలప్రియ సోదరుడు ..

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో జగత్ కూడా...!

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా కుటుంబ సభ్యుల పాత్ర దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల అదుపులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఉన్నట్లు చెబుతున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు కిడ్నాపర్లతో జగత్ మాట్లాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిలప్రియ అరెస్ట్ సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని విచారించిన పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించి వదిలేశారు. జగత్ విఖ్యాత్ డ్రైవర్ చెప్పిన ఆధారాలతో మరోసారి అతన్ని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే భూమా అఖిలప్రియ రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. 


Updated Date - 2021-01-12T23:52:41+05:30 IST