భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు రావాల్సిందిగా గవర్నర్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-22T00:35:27+05:30 IST

దీపావళి పండగ వచ్చిందంటే చాలు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూ కడతారు.

భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు రావాల్సిందిగా గవర్నర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌: దీపావళి పండగ వచ్చిందంటే చాలు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూ కడతారు. ఈసారి నవంబరు 4వ తేదీన జరిగే దీపావళి పండగ రోజున భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు రావాల్సిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఆలయ ట్రస్టీ శశికళ ఆహ్వానించారు. గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని నగర వాసుల విశ్వాసం. 

Updated Date - 2021-10-22T00:35:27+05:30 IST