కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-05-20T05:48:06+05:30 IST

కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో  భగీరథ మహర్షి జయంతి వేడుకలు

భూపాలపల్లి కలెక్టరేట్‌, మే 19: భగీరథ మహర్షి జయంతి వేడుకలు భూపాలపల్లి కలెక్టరేట్‌లో బుధవారం జరిగాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పూలమాల వేసి నివాళులర్పించారు. కొవిడ్‌ నిబంధనల  అనుసరించి జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి శైలజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ములుగు సంక్షేమ శాఖ కార్యాలయంలో..

ములుగు కలెక్టరేట్‌ : ములుగులోని జిల్లా సంక్షేమ భవనంలో   మహర్షి భగీరథ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భగీరథుడి చిత్రపటానికి  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎస్‌.లక్ష్మణ్‌  పూలమాల వేసి నివాళులు అర్పించారు.


Updated Date - 2021-05-20T05:48:06+05:30 IST