భగీరథ ‘ఫౌంటేన్‌’

ABN , First Publish Date - 2021-02-05T09:11:21+05:30 IST

నీళ్లు నింగిన తాకాయి. ఫౌంటేన్‌లా ఎగిసిపడ్డాయి. ఈ దృశ్యం భూపాలపల్లి జిల్లా గణపురంలోని ప్రధాన రహదారిలో గురువారం కనిపించింది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ వాల్వ్‌ లీకేజీ కావడంతో సుమారు 50 అడుగుల ఎత్తులో నీళ్లు...

భగీరథ ‘ఫౌంటేన్‌’

నీళ్లు నింగిన తాకాయి. ఫౌంటేన్‌లా ఎగిసిపడ్డాయి. ఈ దృశ్యం భూపాలపల్లి జిల్లా గణపురంలోని ప్రధాన రహదారిలో గురువారం కనిపించింది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ వాల్వ్‌ లీకేజీ కావడంతో సుమారు 50 అడుగుల ఎత్తులో నీళ్లు ఎగిసిపడగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.  మిషన్‌భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ వల్ల నీళ్లు వృథాగా పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.  

- గణపురం

Updated Date - 2021-02-05T09:11:21+05:30 IST