భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ABN , First Publish Date - 2021-07-24T13:00:30+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో పర్ణశాలలో స్వామివారి

భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది.  అంతేకాదు.. సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 42.5 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. అప్రమత్తమైన అధికారులు భద్రాచలంలోని లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Updated Date - 2021-07-24T13:00:30+05:30 IST