బెస్ట్‌ బెట్‌ టీఆర్‌ఎస్‌!

ABN , First Publish Date - 2021-10-31T08:42:24+05:30 IST

: టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ నువ్వానేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగింది...

బెస్ట్‌ బెట్‌ టీఆర్‌ఎస్‌!

అధికార పార్టీపై కోట్లలో పందెం

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ నువ్వానేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగింది. ఉత్కంఠలో మరో ఉత్కంఠ ఏమిటంటే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటే పందెం రాయుళ్లలో ఎక్కువమంది  టీఆర్‌ఎస్‌ పార్టీనే గెలుస్తుందని కోట్లలో డబ్బులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బెట్టింగ్‌ రాయుళ్లలో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఏపీలోని బద్వేలులో కూడా ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. అయితే ఆ ఫలితంపై ఆసక్తి చూపకుండా అక్కడి పందెం రాయుళ్లు హుజూరాబాద్‌పైనే కన్నేశారని సమాచారం. పైగా అధికార పార్టీనే ఈ ఉప ఎన్నికల్లో గెలుస్తుందని డబ్బులు పెట్టినట్లు చెబుతున్నారు. బీజేపీ గెలుస్తుందని కూడా పందాలు కాసినవారు ఉన్నారని బెట్టింగ్‌ రాయుళ్లు అంటున్నారు. అయితే పోలింగ్‌ తర్వాత వివిధ సర్వే సంస్థలు చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడటంతో పందెం రాయుళ్లలో కొందరు తమ మనసు మార్చుకున్నట్లు సమాచారం. మరికొంతమంది బెట్టింగ్‌రాయుళ్లు మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ ఆధారంగా పందెం కాసినట్లు తెలుస్తోంది. ఇంకొందరు ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత బెట్టింగ్‌ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు కూడా చెబుతున్నారు. అంతకుముందు అధికార పార్టీ గెలుస్తుందని పందెం కాసిన వాళ్లు, ఎగ్జిట్‌ పోల్‌ తర్వాత విత్‌ డ్రా అయినట్లు సమాచారం.  

Updated Date - 2021-10-31T08:42:24+05:30 IST