నల్లమలలో పులుల గణన ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-20T08:46:29+05:30 IST
నల్లమలలో పులుల గణన ప్రారంభం

నాగర్‌కర్నూల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : నల్లమలలో పులుల గణనకు ఫారెస్టు అధికారులు మంగళవారం శ్రీకారం చుట్టారు. పులుల సంఖ్య లెక్కింపు ప్రక్రియ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. అచ్చంపేట, అమ్రాబాద్, నాగార్జునసాగర్ ఫారెస్టు డివిజన్లను 270 బీట్లుగా విభజించి, దాదాపు 600 కెమెరాలను అమర్చి పులుల జాడలు, వాటి పాదముద్రల నమూనాలను సేకరించి డెహ్రాడూన్‌లోని నేషనల్ కన్జర్వేషన్ అఽథారిటీకి పంపిస్తారు.