టీఆర్‌ఎస్‌ పగ్గాలు బీసీలకివ్వాలి

ABN , First Publish Date - 2021-10-25T08:29:22+05:30 IST

రాజకీయ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీ 60 లక్షల సభ్యత్వాల్లో 50 లక్షలున్న బీసీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని బీసీ

టీఆర్‌ఎస్‌ పగ్గాలు బీసీలకివ్వాలి

  • జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీ 60 లక్షల సభ్యత్వాల్లో 50 లక్షలున్న బీసీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులు, మంత్రి వర్గంలో కూడా బీసీలకు తగిన న్యాయం చేయలేదని, సీఎం పదవి ఎలాగూ ఇవ్వరు.. అధ్యక్ష పీఠమైనా ఇవ్వాలని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. సోమవారం జరిగే ప్లీనరీలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని జాజుల కోరారు. 

Updated Date - 2021-10-25T08:29:22+05:30 IST