పాఠశాలలు రద్దు చేసినా, టీచర్ల సంఖ్య తగ్గించినా ఉద్యమిస్తాం: ఆర్‌.కృష్ణయ్య

ABN , First Publish Date - 2021-08-20T09:31:05+05:30 IST

రేషనలైజేషన్‌ పేరుతో టీచర్ల సంఖ్యను తగ్గించినా, ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసినా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని

పాఠశాలలు రద్దు చేసినా, టీచర్ల సంఖ్య తగ్గించినా ఉద్యమిస్తాం: ఆర్‌.కృష్ణయ్య

రాంనగర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : రేషనలైజేషన్‌ పేరుతో టీచర్ల సంఖ్యను తగ్గించినా,  ప్రభుత్వ పాఠశాలలను  ఎత్తివేసినా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం  అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు.  ఖాళీగా ఉన్న 40 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతం అవుతుందన్నారు. టీచర్లు లేకపోతే విద్యార్థులు ఉండరు, టీచర్లను నియమిస్తే విద్యార్థులు వస్తారు, దీనిని ప్రభుత్వం గ్రహించాలని చెప్పారు. 

Updated Date - 2021-08-20T09:31:05+05:30 IST