‘బీసీ బంధు’ ఇవ్వకుంటే ఓట్ల బంద్‌:జాజుల

ABN , First Publish Date - 2021-08-27T10:17:33+05:30 IST

‘బీసీ బంధు’ ఇవ్వకుంటే ఓట్ల బంద్‌:జాజుల

‘బీసీ బంధు’ ఇవ్వకుంటే ఓట్ల బంద్‌:జాజుల

కాజీపేట టౌన్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరిగేలోపే బీసీ బంధు ప్రకటించాలని, లేకుంటే బీసీ ఓట్ల బంద్‌కు దిగుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. హన్మకొండ జిల్లా కేంద్రం కాజీపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత బంధుకు నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.  బీసీ బంధు అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 

Updated Date - 2021-08-27T10:17:33+05:30 IST