సీఎస్ ను కలిసిన బిసి కమిషన్ ఛైర్మన్

ABN , First Publish Date - 2021-09-03T20:37:33+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వకులాభరణం కృష్ణమోహన్, కమిషన్ సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను బి.ఆర్.కె.ఆర్ భవన్ లో శుక్రవారం కలిసారు.

సీఎస్ ను కలిసిన బిసి కమిషన్ ఛైర్మన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వకులాభరణం కృష్ణమోహన్, కమిషన్ సభ్యులతో రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్  కుమార్ ను బి.ఆర్.కె.ఆర్  భవన్ లో శుక్రవారం కలిసారు. రాష్ట్రంలో బిసి కులాలకు సేవచేసే అవకాశం కల్పించినందులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. బిసి కమీషన్ ద్వారా బిసిలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా పనిచేందుకు ప్రభుత్వం తగు సహాయసహకారాలు అందిస్తుందని సీఎస్ వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, కమిషన్ సభ్యులు  సిహెచ్. ఉపేంద్ర, శుభప్రద్  పటేల్, కిషోర్ గౌడ్ లు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T20:37:33+05:30 IST