ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నాం: బత్తిని హరినాథ్‌ గౌడ్

ABN , First Publish Date - 2021-05-30T19:56:47+05:30 IST

లాక్‌డౌన్ దృష్ట్యా ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నామని బత్తిని హరినాథ్‌ గౌడ్ ప్రకటించారు.

ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నాం: బత్తిని హరినాథ్‌ గౌడ్

హైదరాబాద్‌: లాక్‌డౌన్ దృష్ట్యా ఈ ఏడాది చేపమందు పంపిణీ నిలిపి వేస్తున్నామని బత్తిని హరినాథ్‌ గౌడ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ చేయడం లేదని, ప్రజలెవరూ చేప మందు కోసం రావద్దని కోరారు. జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్లం మాత్రమే తీసుకుంటామని తెలిపారు. నెల్లూరు ఆనందయ్యది పురాతన కాలంనాటి నాటు వైద్యమన్నారు. ఆనందయ్య కరోనా మందు.. ఆయుర్వేదం అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు. ప్రజలకు మేలు జరుగుతుంది అంటే తప్పకుండా ఆనందయ్యకు తన మద్దతు ఉంటుందని బత్తిని హరినాథ్‌ గౌడ్ ప్రకటించారు.


Read more