గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: బండి
ABN , First Publish Date - 2021-12-31T05:47:15+05:30 IST
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: బండి

సంగెం/మామునూరు, డిసెంబరు30 : బీజేపీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అధ్యక్షతన పార్టీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా సంజయ్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ఆదరాభిమానాలతో పార్టీ బలోపేతమవుతోందని, ఇందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమనిన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ పటిష్టమై వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీ లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంక్షేమం కోసం మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులను కేటాయిస్తుండగా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తూ కేంద్ర ఉనికి లేకుండా చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంతో పార్టీ కార్యకర్తలు గడపగడపకూ వెళ్లి కేంద్రం పథకాల గురించి వివరించాలని సూచించారు. జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంతో నిరుద్యోగుల ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బండారు శ్రుతి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, రేవూరి ప్రకా్‌షరెడ్డి, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీ్‌షసా, జిల్లా నాయకులు పాల్గొన్నారు.