జన హృదయనేత వాజ్‌పేయి

ABN , First Publish Date - 2021-12-26T05:26:22+05:30 IST

జన హృదయనేత వాజ్‌పేయి

జన హృదయనేత వాజ్‌పేయి
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

హనుమకొండ రూరల్‌, డిసెంబరు 25: భారత ప్రధానిగా దేశ అభివృద్ధిని కొత్త పుంతలు తొ క్కించి, అనేక సాహసోపేత నిర్ణయాలతో భారత సమగ్రాభివృద్ధికి నాంది పలికిన జన హృదయనేత వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. హంటర్‌రోడ్‌లోని గణపతి ఇం జనీరింగ్‌ కాలేజీలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరుగుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తల రెండరోజు శిక్షణ శిబిరానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ముందుగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్రమోదీ పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేసి ఆరు లక్షల గ్రామాలకు ప్రధానమంత్రి సడక్‌ యోజన కింద రోడ్లు వేసినట్లు తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో అధికారం చేపట్టేలా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. రెండో శిక్షణ తరగతులలో జిల్లా ఇన్‌చార్జి దామోదర్‌రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్‌ వి.ముళీధర్‌గౌడ్‌, జోనల్‌ ఇన్‌చార్జి బంగారు శృతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రే మేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ గుండె విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జైపాల్‌, మార్తినేని ధర్మారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు గురుమూర్తి శివకుమార్‌, గుజ్జ సత్యనారాయణ, గురుప్రసాద్‌, సంతో్‌షరెడ్డి, సదానందంగౌడ్‌, జయంతిలాల్‌, జితేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-26T05:26:22+05:30 IST