ఆలస్యంగానైనా మంచి నిర్ణయం : బండి సంజయ్

ABN , First Publish Date - 2021-05-19T03:09:52+05:30 IST

ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని

ఆలస్యంగానైనా మంచి నిర్ణయం : బండి సంజయ్

హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని తాము వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి ఫలించిందని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంలో చేరాలని ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష’’ను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స చేయడంతో పాటు పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-19T03:09:52+05:30 IST