టీఆర్ఎస్లో నెక్ట్స్ బలయ్యేది హరీష్‌రావే: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-10-20T19:26:35+05:30 IST
జమ్మికుంట టీఆర్ఎస్లో నెక్ట్స్ బలయ్యేది హరీష్ రావేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నేడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..

కరీంనగర్: జమ్మికుంట టీఆర్ఎస్లో నెక్ట్స్ బలయ్యేది హరీష్ రావేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నేడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హరీష్ రావు నీ పైన కేసీఆర్ టార్గెట్ పెట్టారు. నువ్వు మంచోడివే.. కానీ అబద్దాలు మాట్లాడకు.. కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయి. ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ.. మరొకటి మీడియా ముందు అబద్దాలు మాట్లాడే కమిటి. కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? వేల కోట్లతో హుజురాబాద్‌లో గెలవాలని అనుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.