కలెక్టర్‌లతో కాళ్ళు మెక్కించుకోవడం సిగ్గు చేటు: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-06-21T19:16:17+05:30 IST

కలెక్టర్‌లతో కాళ్ళు మెక్కించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌కు రావటం సిగ్గుచేటు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు

కలెక్టర్‌లతో కాళ్ళు మెక్కించుకోవడం సిగ్గు చేటు: బండి సంజయ్

హైదరాబాద్: కలెక్టర్‌లతో కాళ్ళు మెక్కించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌కు రావటం సిగ్గుచేటు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కలెక్టర్ తీరుతో దేశంలోని ఐఏఎస్ అధికారులంతా సిగ్గు పడుతున్నారన్నారు. హుజురాబాద్‌‌లో టీఆర్ఎస్‌‌కు అభ్యర్థి లేరన్నారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. హుజురాబాద్‌లో వార్‌ వన్‌ సైడే బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో బండి సంజయ్ పేర్కొన్నారు.


Updated Date - 2021-06-21T19:16:17+05:30 IST