ప్రజాపోరాటాల్లో తన్నులు తినడానికి ముందుంటా: బక్కని
ABN , First Publish Date - 2021-07-21T08:38:38+05:30 IST
ప్రజా పోరాటాల్లో తన్నులు తినడానికి తాను ముందుంటానని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందని ...
హైదరాబాద్, జులై 20(ఆంధ్రజ్యోతి): ప్రజా పోరాటాల్లో తన్నులు తినడానికి తాను ముందుంటానని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువుగా తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.