కేబీఆర్ పార్క్‌లో నటిపై దాడి చేసిన నిందితుడు బాబు అరెస్టు
ABN , First Publish Date - 2021-11-21T08:13:24+05:30 IST
కేబీఆర్ పార్క్‌లో సినీ నటి చౌరాసియాపై దాడిచేసి సెల్‌ఫోన్ అపహరించిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. షూటింగ్‌ల్లో సెట్ వర్క్ హెల్పర్‌గా పనిచేస్తున్న కొమ్ము బాబు ఈ దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేబీఆర్ పార్క్‌లో సినీ నటి చౌరాసియాపై దాడిచేసి సెల్‌ఫోన్ అపహరించిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. షూటింగ్‌ల్లో సెట్ వర్క్ హెల్పర్‌గా పనిచేస్తున్న కొమ్ము బాబు ఈ దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. శనివారం సీపీ అంజనీకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కుల్కచర్లకు చెందిన కొమ్ము బాబు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇందిరానగర్‌లో ఉంటూ షూటింగ్‌ల్లో సెట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రోజుకు రూ. 500లు కూలి. నెలలో పదిరోజులే పని. అద్దె చెల్లించడానికీ ఇబ్బందిగా మా రడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్క నే ఉన్న కేబీఆర్ పార్క్‌ను ఎంచుకున్నాడు. ఈ నెల 14న రాత్రి 8:30కి నటి చౌరాసియా వాకింగ్‌కు వెళ్లగా.. బాబు వెన క నుంచి ఆమెపై దాడిచేసి, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. ఫెన్సింగ్ దూకి పారిపోయాడు. పార్కులో చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు నిందితుడ్ని గుర్తించడం కష్టంగా మారింది. సాంకేతిక ఆధారాలేవీ లేకపోవడంతో పో లీసులు సంప్రదాయ విచారణ ప్రారంభించారు. డీసీపీ రాధాకిషన్ నేతృత్వంలో సుమారు 50 మంది రంగంలోకి దిగారు. బాబు నుంచి ఐఫోన్ స్వాధీనం చేసుకున్నామని, నిందితు ణ్ని రిమాండ్‌కు పంపామని సీపీ వెల్లడించారు.