కోల్‌ ఇండియా డైరెక్టర్‌గా బి. వీరారెడ్డి

ABN , First Publish Date - 2021-11-26T09:42:12+05:30 IST

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన బి.వీరారెడ్డికి కోల్‌ ఇండి యాలో కీలక పదవి దక్కింది.

కోల్‌ ఇండియా డైరెక్టర్‌గా బి. వీరారెడ్డి

సూర్యాపేట జిల్లా వాసికి కీలక పదవి

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన బి.వీరారెడ్డికి కోల్‌ ఇండి యాలో కీలక పదవి దక్కింది. ఆయనను కోల్‌ ఇండియా డైరెక్టర్‌ (టెక్నికల్‌)గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీరారెడ్డి ప్రాథమిక విద్య  నడిగూడెంలో పూర్తి చే శారు. ఉన్నత విద్యను కోదాడలో అభ్యసించారు. 1986లో కొత్తగూడెంలోని స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌లో మైనింగ్‌ ఇంజనీరింగ్‌ చేసి.. 1987లో సింగరేణిలో ఇంజనీర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. సింగరేణిలో డైరెక్టర్‌గా పనిచేస్తూ ఈస్ట్రర్న్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్‌ (టెక్నికల్‌) నియామకం కోసం పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ) నిర్వహించిన ఇంటర్వ్యూకు ఎంపికై కొంతకాలంగా డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను కోల్‌ ఇండియా డైరెక్టర్‌ (టెక్నికల్‌)గా నియమించాలని కోరుతూ బొగ్గు మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు పంపగా.. దీన్ని ఆమోదిస్తూ గురువారం కేబినెట్‌ నియామకాల కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది.  వీరారెడ్డి 2022 ఫిబ్రవరి 1 నుంచి కొత్త బాధ్యతలు తీసుకోనున్నారు.  

Updated Date - 2021-11-26T09:42:12+05:30 IST