కేసీఆర్ వడ్లు కొనకుండా విహార యాత్రలు చేస్తున్నారు: అయోధ్యరెడ్డి
ABN , First Publish Date - 2021-11-26T19:32:42+05:30 IST
ప్రతీ గ్రామంలో కల్లాల్లో వడ్ల కుప్పలు మొలకెత్తాయని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల రైతాంగం నష్టపోతోందన్నారు.

హైదరాబాద్: ప్రతీ గ్రామంలో కల్లాల్లో వడ్ల కుప్పలు మొలకెత్తాయని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల రైతాంగం నష్టపోతోందన్నారు. వడ్ల కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్నారన్నారు. వడ్లు కొనకుండా కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్‌లో విహార యాత్రలు చేస్తున్నారన్నారు. రాక్షసుల్లా వెళ్లి ఉప ఎన్నికల ప్రచారం చేసే టీఆర్ఎస్ నాయకులు కల్లాల్లోకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రతీ గింజనూ కొనాలనే డిమాండ్‌తో రేపు, ఎల్లుండి ఇందిరాపార్క్ దగ్గర దీక్ష జరగనుందని అయోధ్యరెడ్డి పేర్కొన్నారు.