ఆటో, బైక్ ఢీ

ABN , First Publish Date - 2021-08-25T23:39:06+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా, అక్రమంగా తరలిస్తున్ రేషన్

ఆటో, బైక్ ఢీ

వనపర్తి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా, అక్రమంగా తరలిస్తున్ రేషన్ బియ్యం బయటపడ్డాయి. వీపనగండ్ల మండలంలోని కల్వరాల దగ్గర ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని  ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు   పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-25T23:39:06+05:30 IST