కమిషన్ విషయంలో గొడవ.. కత్తితో దాడి
ABN , First Publish Date - 2021-05-21T18:55:44+05:30 IST
హైదరాబాద్/మదీన : కారు అమ్మకానికి సంబంధించి కమిషన్ ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన ఘటన

హైదరాబాద్/మదీన : కారు అమ్మకానికి సంబంధించి కమిషన్ ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... హషామాబాద్‌కు చెందిన నయీమ్ (25) అనే యువకుడు సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ బిజినెస్ చేస్తుంటాడు. అతనికి మూడు నెలల క్రితం ఖయ్యూమ్ అనే యువకుడు కమిషన్ మీద విక్రయించి డబ్బులు ఇవ్వమని ఒక కారును ఇచ్చాడు. నయీమ్ ఆ కారును విక్రయించాడు కానీ ఖయ్యూమ్‌కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. దీంతో అతడిని నిలదీయగా కారును విక్రయించగా ఎలాంటి లాభం రాలేదని చెప్పాడు. రెండు నెలలనుంచి ఖయ్యూమ్ కమిషన్ ఇవ్వమని అడుగుతూ వస్తున్నాడు. నయీమ్ ఇవ్వడంలేదు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో నయీమ్ ఇంటికి వచ్చిన ఖయ్యూమ్ బయటికి రావాల్సిందిగా కోరాడు. నయీమ్ ఇంట్లోనుంచి బయటికి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో నయీమ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో నయీమ్ భుజంపై గాయమైంది. గాయపడ్డ అతడిని కుటుంబసభ్యులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం గురువారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.