యువకుడిపై కత్తులతో దాడి

ABN , First Publish Date - 2021-03-22T13:18:07+05:30 IST

నగరంలోని ఓ వ్యక్తిపై దాడి జరిగింది.

యువకుడిపై కత్తులతో దాడి

హైదరాబాద్‌: నగరంలోని ఓ వ్యక్తిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అబ్దుల్ రిజ్వాన్‌ అనే వ్యక్తిపై  గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. రక్తపు మడుగులతోనే రియాజ్ మసీదులోకి వెళ్లి ‌ ప్రాణాలను కాపాడుకున్నాడు. అక్కడికి స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. 


తీవ్రంగా గాయపడిన రిజ్వాన్‌ పరిస్థితి విషమం ఉంది. చికిత్స నిమిత్తం రిజ్వాన్‌‌ను ఉస్మానియా ఆస్పత్రికి  పోలీసులు తరలించారు. సీసీ కెమెరా ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-22T13:18:07+05:30 IST