అసెంబ్లీ సీట్లను పెంచాలి: వినోద్‌ కుమార్‌

ABN , First Publish Date - 2021-10-25T08:06:58+05:30 IST

జమ్మూకశ్మీర్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అసెంబ్లీ సీట్లను పెంచాలి: వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాలన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం నినాదాన్ని తెలుగు రాష్ట్రాలకూ వర్తింపజేయాలన్నారు.   

Updated Date - 2021-10-25T08:06:58+05:30 IST