అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే అరూరి
ABN , First Publish Date - 2021-05-08T05:53:57+05:30 IST
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే అరూరి

హసన్‌పర్తి, మే 7: రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. శుక్రవారం ఎర్రగట్టుగుట్ట వద్ద గల బాలాజీ గార్డెన్స్‌లో 153 మందికి కళ్యా ణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే రంజాన్ పర్వదినాన్ని పురస్క రించుకుని 353 మంది ముస్లింకు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో దాని నుంచి బయటపడేందుకు ప్రార్ధనలు చేయాలని ముస్లింలను కోరారు. కార్యక్ర మంలో తహసీల్ధార్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.