అరెస్ట్‌లతో 'నిరుద్యోగ దీక్ష'ను అడ్డుకోలేరు: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2021-12-27T02:43:47+05:30 IST

అరెస్ట్‌లతో 'నిరుద్యోగ దీక్ష'ను అడ్డుకోలేరని బీజేపీ నేత బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అరెస్ట్‌లతో 'నిరుద్యోగ దీక్ష'ను అడ్డుకోలేరు: బండి సంజయ్‌

హైదరాబాద్: అరెస్ట్‌లతో 'నిరుద్యోగ దీక్ష'ను అడ్డుకోలేరని బీజేపీ నేత బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీక్షకు వస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతల అరెస్ట్ దుర్మార్గమన్నారు. కొవిడ్ నిబంధనలతో పార్టీ ఆఫీసులో దీక్ష చేస్తే.. ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటి? అని ప్రశ్నించారు. 600 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదని సంజయ్‌ ధ్వజమెత్తారు. సోమవారం యథావిధిగా బీజేపీ నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇందిరా పార్కు నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి దీక్ష వేదిక మార్చారు. పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేయనున్నారు. బీజేపీ దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.

Updated Date - 2021-12-27T02:43:47+05:30 IST