భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు

ABN , First Publish Date - 2021-12-30T05:47:12+05:30 IST

భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు

భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు

కృష్ణకాలనీ, డిసెంబరు 29: భార్యను హత్య చేసిన కేసులో భర్తను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. భూపాలపల్లి సీఐ వాసుదేవరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామానికి చెందిన ఒల్లాల సమ్మయ్యతో అదే గ్రామానికి చెందిన శ్రీలతతో పదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన సమ్మయ్య భార్యతో నిత్యం గొడవ పడేవాడు. పైగా ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈనెల 26న రాత్రి అతిగా మద్యం తాగొచ్చిన సమ్మయ్య అప్పటికే నిద్రకు ఉపక్రమించిన భార్యపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి గూడెపు మదునమ్మ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం  పక్కా సమాచారం మేరకు నిందితుడిని అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌ నిమిత్తం పరకాల కోర్టుకు తరలించారు.


Updated Date - 2021-12-30T05:47:12+05:30 IST