సీఎంపై అనుచిత వాఖ్యలు.. ఈటల అనుచరుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-05-21T08:52:13+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అనుచరుడు పోలు లక్ష్మణ్‌ ముదిరాజ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. సీఎంతోపాటు జిల్లా మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీపై

సీఎంపై అనుచిత వాఖ్యలు.. ఈటల అనుచరుడి అరెస్టు

కరీంనగర్‌ క్రైం, మే 20: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అనుచరుడు పోలు లక్ష్మణ్‌ ముదిరాజ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. సీఎంతోపాటు జిల్లా మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీపై లక్ష్మణ్‌ అనుచిత వాఖ్యలు చేశారని రాయనవేని శ్రవణ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఉత్తర తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకుంటామని, ప్రగతి భవన్‌పై రాళ్లదాడి చేస్తామంటూ బెదిరించారని, మంత్రి గంగుల కమలాకర్‌.. ఈటల కాలిగోటికి కూడా సరిపోడంటూ అవమానకరంగా మాట్లాడారని శ్రవణ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-21T08:52:13+05:30 IST