విగ్రహ తరలింపులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-01-21T03:43:16+05:30 IST

విగ్రహ తరలింపులో ఉద్రిక్తత

విగ్రహ తరలింపులో ఉద్రిక్తత
అంబేద్కర్‌ వాదులను అరెస్టు చేస్తున్న పోలీసులు

రఘునాథపల్లి, జనవరి 20: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రఘునాథపల్లిలో అంబేద్కర్‌ విగ్రహ తరలింపుపై ఉత్కంఠ నెలకొంది. సుమారు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బుధవారం ఎల్‌అండ్‌టి అధికారులు పక్కకు తరలిస్తుండగా అంబేద్కర్‌ వాదులు అడ్డుకున్నారు. అధికారులు గతంలో హామీ ఇచ్చిన ప్రకారం ముందుగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ ఆర్డీవో మధుసూదన్‌, ఏసీపీ వినోద్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.  అంబేద్కర్‌ వాదులు కడారి నాగేశ్వర్‌, కొయ్యడ మల్లేశ్‌, కొడిదేటి కుమార్‌, తిప్పారపు రవి, జేరిపోతుల సుధాకర్‌, మహేందర్‌, తాళ్లపల్లి కుమార్‌, కొత్తపల్లి రవిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కాంట్రాక్టర్లు క్రేన్‌తో అంబేద్కర్‌ విగ్రహాన్ని పక్కకు తరలించారు.

Updated Date - 2021-01-21T03:43:16+05:30 IST