2 పథకాల టెండర్లకు ఆమోదం
ABN , First Publish Date - 2021-12-31T08:38:02+05:30 IST
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల టెండర్లను గురువారం జరిగిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ కమిటీ సమావేశం ఆమోదించింది.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల టెండర్లను గురువారం జరిగిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ కమిటీ సమావేశం ఆమోదించింది. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర పథకానికి రూ.2,248.86 కోట్ల అంచనాతో టెండర్లు పిలువగా, రెండు సంస్థలకు అర్హత లభించింది. ఈ పథకానికి 4.65ు అధిక అంచనాతో రూ.2,353.43 కోట్లకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ టెండర్ వేసింది. 4.90ు అధిక అంచనాతో రూ.2,359.05 కోట్లతో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ టెండర్ వేసింది. మేఘాకే పనులు దక్కాయి.బసవేశ్వరఎత్తిపోతల పథకానికి రూ.1,421.99 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. 4.60ు అధికంగా రూ.1,487.41 కోట్లకు మేఘా ఇంజనీరింగ్ టెండర్ వేసింది. 4.8 శాతం అధిక ధరతో రూ.1,490.25 కోట్లతో ఎన్‌సీసీ బిడ్ దాఖలు చేసింది. రెండిటిలో ఎల్1గా నిలిచిన మేఘాకే ఈ రెండు పథకాల పనులు అప్పగించాలని కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా పనులకు కేసీఆర్ జనవరిలో శంకుస్థాపన చేస్తారు.