రేపు వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ మేళా
ABN , First Publish Date - 2021-03-24T06:07:27+05:30 IST
రేపు వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ మేళా

కాకతీయకాలనీ, మార్చి 23 : హైదరాబాద్‌కు చెందిన తొషిబా బహుళజాతి సంస్థ ఈనెల 25న ములుగురోడ్డులోని వరంగల్ ప్రభుత్వ బాలుర ఐటీఐలో అంప్రెంటీస్ మేళా ని ర్వహించనున్నారని ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. 18-26 సంవత్సరాల వయస్సు కలిగి ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రేడ్ పూర్తి చేసిన బాలురు మాత్రమే అర్హులన్నారు. మేళాకు బయోడేటా, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు ఫొటోలు, ఎస్సెస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11వేలు స్టైఫండ్ చెల్లిస్తారన్నారు.