సభ్యత్వ నమోదుకు సమన్వయకర్తల నియామాకం
ABN , First Publish Date - 2021-12-30T08:04:41+05:30 IST
జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

హైదరాబాద్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమన్వయకర్తగా సీ రోహిన్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియమించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు సమన్వయ కర్తలుగా పటేల్ రమేశ్‌రెడ్డి, గుమ్ముల మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. కాగా.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనవరి 4న నిరుద్యోగ దీక్షలు చేపట్టనున్నట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. జనవరి 15 లోపుగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చేయకపోతే ధర్నాలు చేపడతామన్నారు.