వ్యవసాయ, వెటర్నరీ కోర్సులకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-06-16T11:57:15+05:30 IST

పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాలిసెట్‌

వ్యవసాయ, వెటర్నరీ కోర్సులకు దరఖాస్తులు

హైదరాబాద్‌: పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాలిసెట్‌ సమన్వయకర్త ఎన్‌.రాజేశ్వరి తెలిపారు. మూడేళ్ల ఈ కోర్సులలో ఆరు నెలలపాటు పారిశ్రామిక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కోర్సు పూర్తికాగానే ఈ-సెట్‌ ద్వారా బీటెక్‌ రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చని వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 18 వరకు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, అపరాధ రుసుంతో 20వ తేది వరకు అవకాశం కల్పించినట్లు రాజేశ్వరి తెలిపారు. 

Updated Date - 2021-06-16T11:57:15+05:30 IST